YS Jagan in BRS Alliance:
ఈ మధ్యనే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వారు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ వారు.. బిజెపితో పొత్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని.. ఒక సెన్సేషనల్ స్టోరీ ని బయటపెట్టారు. అప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పొత్తుకి సంబంధించిన డీల్ కూడా ఖాయం అయిపోయింది అని.. పొత్తు కుదిరాక కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి లీడర్లకు ఎలాంటి స్థానం ఇవ్వాలి అనే విషయంపై చర్చ మొదలైందని తెలుస్తోంది.
అయితే మరొకవైపు బిజెపి లీడర్లలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల కి ఈ పొత్తు ఏమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. వాళ్ళు ఈ పొత్తు నీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యనే జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలు, కవిత జైలుకి వెళ్లడం, ఇలాంటి సంఘటనల తర్వాత పొత్తు విషయంలో కొందరు బిజెపి లీడర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బిఆర్ఎస్ పరిస్థితి పక్కన పెట్టేస్తే ఈ పొత్తు జరిగితే.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏకాకిలా మారిపోతారు. ప్రస్తుతానికి జగన్ కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఈ పొత్తులో తను కూడా చేరడం. నిన్న మొన్నటిదాకా బిఆర్ఎస్ పార్టీ వారు వైసీపీకి బాగానే సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. జగన్ దారుణ ఓటమి తర్వాత కూడా బిఆర్ఎస్ వాళ్లు వైసీపీకి ఇంతకుముందు ఇచ్చినంత మద్దతు ఇస్తారా అంటే.. కష్టమని చెప్పుకోవాలి.
నిజానికి జగన్ కి ఈ పొత్తులో చేరడం తప్ప మరొక దారి లేదు. కానీ జగన్ ఈ పొత్తు లో చేరడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డు చెప్పే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది.. కానీ మరీ జగన్ ఓడిపోయినంత దారుణంగా అయితే కాదు. 119 సీట్లలో టిఆర్ఎస్ పార్టీ వారు 29 సీట్లు గెలుచుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రతిపక్షం హోదాలో ఉన్నారు.
మరోవైపు జగన్ పరిస్థితి అలా కాదు. 175 సీట్లు తమకే వస్తాయి అంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన జగన్ కి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది వైసిపి. ఒకవైపు ఓటమిపాలైన తర్వాత కూడా.. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చీకట్లోకి వెళ్లిపోకుండా.. అప్పుడప్పుడు నోరు తెరిచి రూలింగ్ పార్టీ మీద ప్రశ్నలు కురిపిస్తూనే ఉంది.
మరొకవైపు జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ నీ వదిలి పెట్టేసి బెంగళూరు చుట్టూ తిరుగుతున్నారు. ప్రజల గురించి మాట్లాడకుండా.. తన సెక్యూరిటీ గురించి మాత్రమే ప్రశ్నలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అంతకుమించి ఆయనకి మరే హోదా లేదు. కనీసం ఎమ్మెల్యేగా కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సెషన్లకు వెళ్లడం లేదు. ఎంతసేపు బెంగళూరు చుట్టూ తిరుగుతూ.. అసెంబ్లీ నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నారు.
ఇవన్నీ పక్కన పెట్టినా కూడా.. అతి త్వరలో జగన్ మీద బోలెడు కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పవర్ లో ఉన్నంతకాలం చేసిన అరాచకాలతో పాటు.. అంతకుముందు చేసిన దౌర్జన్యాలు కూడా కలిపి అన్ని ఒకేసారి.. జగన్ మీద పడే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేస్ మీద ఇన్వెస్టిగేషన్ జోరుగానే జరుగుతుంది. జగన్ దొరికి పోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో జగన్ తో పొత్తు చేసుకోవడం వల్ల బిఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు రావడం తప్ప.. కొంచెం కూడా ఉపయోగం ఉండదు. మరి ఇప్పుడు జగన్ పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాలి.