90s middle class biopic: టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్-7 ఫేమ్ శివాజీ నటించిన #90’s వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ (ETV Win) ఈ సిరీస్ ను రూపొందించింది. ఈమధ్య సిరీస్ సక్సెస్ ను కూడా మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తాజాగా దీనిపై వస్తున్న అప్డేట్ మరింత ఆసక్తి రేపుతోంది.
సాధారణంగా ఈ మధ్య థియేటర్లలో రిలీజైన సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడొస్తాయా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ఈటీవీ విన్ మాత్రం తమ హిట్ #90’s వెబ్ సిరీస్ ను ఓటీటీ నుంచి థియేటర్లలోకి తీసుకెళ్లి మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
1990వ దశకంలో ఓ మధ్యతరగతి కుటుంబం పరిస్థితి ఎలా ఉండేదన్నది కామెడీ టచ్ ఇచ్చి ఆకట్టుకునేలా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో శివాజీతోపాటు మౌళి, వాసుకీ ఆనంద్, వాసంతికా, రోహన్, స్నేహల్ కామత్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఉపాధ్యాయుడిగా, మధ్యతరగతి వ్యక్తిలా శివాజీ జీవించేశారు.
తాను ఎంత మంచి నటుడో నిరూపించుకునేందుకు శివాజీకి చాలా కాలం తర్వాత అవకాశం వచ్చింది. చంద్రశేఖర్ పాత్రలో ఆయనకు ఫుల్ మార్క్స్ పడతాయి. తల్లిగా వాసుకీ నటన కూడా చాలా సహజత్వంతో మెప్పించేలా ఉంది. పెద్ద కొడుకు రఘు పాత్రలో మౌళి తనూజ్ ప్రశాంత్ కూడా పరిణితి చూపించాడు. రోహన్, వసంతిక కూడా బాగా చేశారు. ఈ సిరీస్ ను ఆదిత్య డైరెక్ట్ చేశాడు. నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం నిర్మించారు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందించాడు. ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ వస్తోంది.