కంగనాకి ఇదేం కక్కుర్తి!
మనిషన్నాక జీవితంలో ఏదో ఒక విషయంలో “కక్కుర్తి” పడతాడు, అది మానవ సహజం. కానీ ఒక స్టేజ్ కి వచ్చాక అలా కక్కుర్తి పడడం సదరు వ్యక్తికి సంఘంలో ఉన్న గౌరవమర్యాదలను భంగపరుస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ విషయంలో అలాంటి సంఘటనే చోటు చేసుకొంది. ఇటీవల అమ్మడు ఓ ప్రముఖ షాంపూ కంపెనీ యాడ్ కోసం సైన్ చేసింది. షూట్ కోసం ఎక్కడ్నుంచో లక్ష రూపాయలు విలువ చేసే ఓ విగ్ ను తీసుకొచ్చారట షూటింగ్ అంతా బాగా జరిగింది, కానీ విగ్ మిస్సింగ్. కంపెనీ బృందం షూటింగ్ స్పాట్ మొత్తం గాలించినా విగ్ దొరకలేదు. కట్ చేస్తే.. కంగనా టీం సభ్యులు ఆ విగ్ ను తీసినట్లుగా తెలిసింది.
దాంతో.. ఆ విగ్ ను తిరిగి ఇవ్వమని చాలా మర్యాదపూర్వకంగా కోరారట. అయితే.. కంగనా టీం మెంబర్స్ సరిగా రెస్పాండ్ అవ్వకపోవడంతో వాళ్ళ రెగ్యులర్ వే లో వెళ్ళి విగ్ ను వెనక్కి తెచ్చుకొన్నారు. ఆ కంపెనీవారికి లక్ష రూపాయలు పెద్ద ఎక్కువ కాకపోయినా కంగనా మరియు ఆమె బృందం చేసిన కక్కుర్తి పని నచ్చని సదరు కంపెనీ ఈ విధంగా రూడ్ గా రెస్పాండ్ అయ్యారట. అసలే హృతిక్ వివాదం కారణంగా పరువుపోగొట్టుకొన్న కంగనాకు ఇలాంటివి అవసరం అంటారా??