‘ఓడలు బండ్లు అవ్వడం.. బండ్లు ఓడలు అవ్వడం’ అంటే ఇదేనేమో.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్‌గా ఉన్న అతడు నేడు భిక్షమెత్తుకుంటున్నాడు. విరావలోకి వెలితే.. కోలీవుడ్ లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచిన సెంథిల్ నాదన్ అనే దర్శకుడు.. అవకాశాలు లేకపోవడంతో.. కంచిపురంలో దేవాలయం వద్ద భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడట.
ఒకప్పుడు ఎంజీఆర్ సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జంబులింగం తనయుడు సెంథిల్ నాథన్.. తండ్రి నడిచిన బాటలోనే సినీ ఇండస్ట్రీకి వచ్చాడు. అసిస్టెంట్ గా కొన్నాళ్ళు పనిచేసి దర్శకుడిగా మారారు. తమిళంలో దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తానే నిర్మాతగా మారి ఉన్నైనాన్ అనే చిత్రాన్ని నిర్మించారు. 2009 లో నిర్మితమైన ఈ సినిమా కొన్ని కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా తరువాత అవకాశాలు రాలేదు. పైగా బుల్లితెరపై కూడా తగినంత గుర్తింపు రాకపోగా.. సీరియల్ నుంచి తొలగించడంతో మనస్తాపం చెంది.. సినిమా ఇండస్ట్రీని వదిలి కాంచీపురం వెళ్లి అక్కడ గుడిదగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగించడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన అతని కుటుంబసభ్యులు, సినీపరిశ్రమకు చెందిన కొందరు అక్కడికి వెళ్లి రమ్మని కోరగా రానని చెప్పారట. దీంతో కుటుంబసభ్యుల పోలీసుల సహాయంతో సెంథిల్ నాథన్ ను చెన్నైకు తీసుకొచ్చి.. ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు.