మెగా హీరో వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా షూటింగ్ కర్నూలు నుంచి అంనతపురం జిల్లాకు షిఫ్ట్ చేసిన సంగతి తెల్సిందే. సినిమా షూటింగ్ కు బ్రేక్ లేకుండా చేయాలి అనుకుంటున్న సమయంలో బ్రేక్ పడింది. వాల్మీకి కులానికి చెందిన కొంతంది వ్యక్తులు షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వచ్చి గొడవ చేశారు.
ఎంత సర్ధిచెప్పినా వినలేదు. గొడవ చేయడం మానలేదు. దీంతో అక్కడ జరగాల్సిన షూటింగ్ ను క్యాన్సిల్ చేసి చేవెళ్ల ప్రాంతంలో షూటింగ్ ను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ మూవీని తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్.