Mahesh Babu’s heroine Meenakshi Chaudhary in Depression:
టాలీవుడ్‌లో ఒకే ఏడాదిలో ఆరు సినిమాలతో హీట్ పెంచిన Mahesh Babu గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి ఇప్పుడు సంక్రాంతి బరిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఆమెకు సీనియర్ స్టార్ వెంకటేశ్‌తో కలిసి నటించే అవకాశం లభించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 14, 2025న విడుదల కానుంది.
ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని క్లిష్ట సమయంలో గురించి మాట్లాడారు. ప్యాన్ ఇండియన్ సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT)’ విడుదల తర్వాత ఆమెపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ జోరుగా జరిగిందట. ఆమె నటనపై వచ్చిన విమర్శలు ఆమెను ఒక వారం పాటు డిప్రెషన్‌లోకి తీసుకెళ్లాయట.
View this post on Instagram
అయితే, అదే సమయంలో తెలుగు బ్లాక్‌బస్టర్ ‘లక్కీ భాస్కర్’ ఆమెకు గొప్ప విజయాన్ని అందించింది. ఈ విజయంతో ఆమెకు చాలా అభినందనలు వచ్చాయి. అందుకే, మంచి కథలు, మంచి ప్రాజెక్టులు ఎంచుకోవడం ఎంతో ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చారు.
తాజాగా మీనాక్షి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటించేందుకు సైన్ చేశారు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఆమె ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
తెలుగులో తనకు దొరికిన అవకాశాలన్నీ సరిగ్గా వాడుకుని, స్టార్ హీరోయిన్‌గా నిలవాలనే లక్ష్యంతో మీనా చౌదరి దూసుకెళ్తున్నారు. ఇకపోతే, సంక్రాంతి బరిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి!