
Shah Rukh Khan latest news:
బాలీవుడ్ లో షారుక్ ఖాన్ పేరు చెప్పగానే అందరికీ “కింగ్ ఖాన్” అని గుర్తు వస్తుంది. కానీ ఈ స్థాయికి చేరుకోవడం అంత తేలికకాదు. కష్టపడి పనిచేయడం, ఎప్పటికీ నేర్చుకోవడమే ఆయన విజయ రహస్యం. నటి షీబా ఆకాష్‌దీప్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
షీబా తన సినీ ప్రయాణంలో షారుక్ ఖాన్‌తో కలిసి పని చేసిన అనుభవాలను పంచుకున్నారు. “ఢిల్లీ నుంచి ముంబై వచ్చినప్పుడే SRK కి తాను పెద్ద స్టార్ అవ్వబోతున్నాననే నమ్మకం ఉండేది. అది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, అతని అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వం కూడా కీలకంగా మారాయి” అని అన్నారు.
షారుక్ ఎంత ఖచ్చితంగా పనిచేస్తాడో చెప్పే ఒక సంఘటనను షీబా గుర్తు చేసుకున్నారు. “అతను రాత్రంతా మెలకువగా గడిపి తన నటనను మెరుగుపరచడానికి కష్టపడేవాడు. పూర్తిగా సంతృప్తి చెందేవరకు నిద్రపోవడం కూడా మానేసేవాడు. ఇప్పుడు కూడా అతను అదే విధంగా పనిచేస్తున్నాడని అనిపిస్తుంది” అని చెప్పారు.
కేవలం స్టార్‌డమ్‌కు మాత్రమే కాకుండా, తన వ్యక్తిత్వానికి కూడా SRK ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. “ఇప్పటికీ ఎప్పుడైనా కలిసినా అతను చాలా వినయంగా ఉంటాడు. ఎప్పుడూ తన ఊతం ఎక్కడిది, ఎవరు తోడున్నారు అనే విషయాన్ని మరచిపోడు” అని షీబా పేర్కొన్నారు.
ప్రస్తుతం షారుక్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి ‘కింగ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా, ఫరా ఖాన్ దర్శకత్వంలో ‘మేన్ హూనా 2’ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కథాచిత్తరాన్ని ఆయన చాలా ఇష్టపడుతున్నారట.