Salman Khan House:
బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ పేరు అందరికీ తెలిసిందే. మూడు దశాబ్దాల కెరీర్‌లో సల్మాన్ అభిమానుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన చోటు సంపాదించుకున్నారు.
2024లో సల్మాన్ ఖాన్ సంపద రూ. 2,900 కోట్లకి చేరింది. ఒక్క సినిమా కోసం రూ. 100-150 కోట్లు తీసుకుంటారు సల్మాన్. అంటే నెలకు రూ. 16 కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ సల్మాన్ మాత్రం చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతారు.
View this post on Instagram
ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో సల్మాన్ ఒక చిన్న 1BHK ఫ్లాట్‌లో ఉంటారు. ఇతర స్టార్ల లాగా పెద్ద బంగ్లాలు కాదని, తన తల్లిదండ్రుల దగ్గర ఉండటమే తనకి ఇష్టం అని సల్మాన్ చెప్పారు. “చిన్నప్పటి నుంచి నేను ఈ రోడ్డు మీదనే తిరుగుతున్నాను. ఇదే నాకు అలవాటు” అని అన్నారు.
సల్మాన్ ఇంట్లో సోఫా, డైనింగ్ టేబుల్, చిన్న జిమ్, ఒక మీటింగ్ గది, పడక గది ఉన్నాయి. ఆయనకి ఖరీదైన వస్తువులు, బహుమతులపై ఆసక్తి లేదని ఆయన స్నేహితులు చెబుతూ ఉంటారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా సికందర్ తో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా టీజర్ నిన్న విడుదల అవ్వాలి కానీ మాజీ ప్రధాన మంత్రి Manmohan Singh ఆకస్మిక మరణంతో చిత్ర బృందం టీజర్ విడుదల వాయిదా వేసింది.
ALSO READ: Boney Kapoor admits getting attracted to other women