HomeTelugu TrendingEmergency లాంటి ఫ్లాప్ సినిమా OTT రైట్స్ కోసం ఇన్ని కోట్లా?

Emergency లాంటి ఫ్లాప్ సినిమా OTT రైట్స్ కోసం ఇన్ని కోట్లా?

Why Netflix paid a huge amount for a flop movie like Emergency?
Why Netflix paid a huge amount for a flop movie like Emergency?

Emergency OTT release date:

కంగనా రనౌత్ నూతన చిత్రం ఎమర్జెన్సీ రిలీజ్ అవ్వడానికి చాలా రోజులుగా ఇబ్బంది పడింది. చివరకు ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఈ ఏడాది జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. కానీ, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఈ సినిమా ఓటిటీలో మాత్రం హిట్టయింది.

ఎమర్జెన్సీ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం అక్షరాల ₹80 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబట్టలేకపోయినప్పటికీ, ఓటిటీలో మంచి ఆదరణ పొందుతోంది.

ఈ భారీ డీల్ వల్ల కంగనా రనౌత్, ఆమె టీమ్‌కు పెద్ద ఊరట లభించింది. ఎందుకంటే, కంగనా స్వయంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా, జీ స్టూడియోస్‌తో కలిసి కో-ప్రొడ్యూస్ చేసింది. దీంతో ఎమర్జెన్సీ ద్వారా ఆమెకి ఆర్థికంగా పెద్ద నష్టాలు లేకుండా పోయాయి.

ఈ చిత్రంలో కంగనా రనౌత్ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. దేశ రాజకీయాల్లో కీలకమైన కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలను ఈ సినిమాలో చూపించారు. అయితే, ఈ కథనం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో రీలీజ్ అయ్యాక మళ్లీ చర్చకు వచ్చింది.

థియేటర్లలో ఫ్లాప్ అయినా, ఓటిటీలో భారీ డీల్ సంపాదించిన ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మీరు ఇప్పటివరకు చూడకపోతే, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది!

Recent Articles English

Gallery

Recent Articles Telugu