
Nani HIT 3 Release Date:
నేచురల్ స్టార్ నాని మరోసారి ఓ ఇంటెన్స్ రోల్‌తో మన ముందుకు రాబోతున్నారు. ‘హిట్: ది థర్డ్ కేస్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ మే 1న థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం పూర్తయ్యింది. మామూలుగా అయితే సినిమా రిలీజ్‌కు వారం ముందు సెన్సార్ చెప్తారు కానీ, హిట్ 3 మాత్రం మూడు వారాల ముందే సెన్సార్ స్క్రీనింగ్ పూర్తిచేసుకుంది. ఇది ప్రాసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఆ స్క్రీనింగ్‌కు స్వయంగా నాని కూడా హాజరయ్యాడు అని టాక్.
సినిమాలో హింసాత్మక సీన్స్ ఎక్కువగా ఉన్నాయట. అందుకే సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి అభ్యంతరాలు వస్తాయో ముందుగానే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముందే స్క్రీనింగ్ చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం సెన్సార్ బోర్డు తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదని తెలిసింది. కానీ కట్‌లు ఎక్కువ వస్తే రివిజన్ కమిటీ దగ్గరకి వెళ్లాలన్న ఆలోచనలో కూడా టీమ్ ఉందట.
నాని కూడా సినిమా కంటెంట్ మీద చాలా కేర్ తీసుకుంటున్నారు. సెన్సార్ సూచనల ప్రకారం అవసరమైన ఎడిటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వారం నుండి ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. టీజర్, ట్రైలర్‌లతో పాటు కొన్ని ఇంటర్వ్యూలు, ఈవెంట్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది.
హిట్ సిరీస్‌కి ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ మూడో పార్ట్‌పై కూడా భారీ అంచనాలున్నాయి. విజువల్స్, స్కోర్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ ఈసారి డబుల్ ప్యాక్‌గా రాబోతున్నాయని ఫిల్మ్ యూనిట్ అంటోంది.