Tollywood Upcoming Movies:
టాలీవుడ్ లో మార్చ్ 28 విడుదల తేదీపై ఉన్న పిచ్చి ప్రత్యేకంగా దృష్టి ఆకర్షిస్తుంది. గతంలో, విజయ్ దేవరకొండ VD12 సినిమాను మార్చ్ 28కు విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇది విజయ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అవ్వబోతుంది అని టాక్ వినిపిస్తోంది.
His Destiny awaits him.
Mistakes.
Bloodshed.
Questions.
Rebirth.28 March, 2025.#VD12 pic.twitter.com/z2k0qKDXTC
— Vijay Deverakonda (@TheDeverakonda) August 2, 2024
ఈ డేట్‌ను అనుసరించి, పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్ర బృందం వారు కూడా మార్చ్ 27ను విడుదల తేదీగా ప్రకటించారు. ఈ సినిమా మీద ఉన్న జోష్, అభిమానుల ఉత్కంఠ ఈ తేదీకి ఊపందించింది. అయితే, కొంతకాలం తరువాత, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాను కూడా మార్చ్‌లో విడుదల చేయడం నిర్ణయించారు. దీంతో ‘OG’ ను మార్చ్ 27 నుంచి మార్చ్ 28కు మళ్లించారు.
Buzz : OG release date 28th March 2025 locked 🔒#PawanKalyan pic.twitter.com/LQOBIfy1Cr
— мαнєѕн ρѕρк™🦅 (@kalyan__cult) August 15, 2024
ఇప్పుడు, ఈ సన్నివేశంలో, చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా కూడా మార్చ్ 28కు విడుదల అయ్యేలా అన్నట్టు టాక్ నడుస్తోంది. మార్చ్ 28, ఉగాది పండగ సెలవ ముందు ఉండటంతో, ఈ తేదీకి ఉన్న డిమాండ్ ఇంకా పెరిగింది.
ప్రస్తుతం, ‘VD12’ మాత్రమే ఈ తేదీకి కచ్చితంగా రానున్న చిత్రం. మరి మిగతా సినిమాలు ఈ డేట్ లాక్ చేస్తాయో లేదో చూడాలి. మార్చ్ 28 తేదీకి సంబంధించిన ఈ సెంటిమెంట్ ఏంటో అనే ఆసక్తి టాలీవుడ్‌ను ఆకర్షిస్తుంది.
Read More: Devara సినిమాతో ప్రభాస్ ను ఈ విషయంలో దాటేసిన ఎన్టీఆర్