
Virat Kohli Puma Deal Ends:
విరాట్ కోహ్లీ పేరు వింటే ఆటలే కాదు, ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా గుర్తుకొస్తాయి. చాలా కాలంగా ప్యూమా బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కోహ్లీ… ఇప్పుడు ఆ బంధానికి ముగింపు పలికారు. ఏటా కోట్లల్లో డీల్ తీసుకునే కోహ్లీ, ఈసారి తన స్వంత బ్రాండ్ one8 పై ఫోకస్ పెంచాలని నిర్ణయించుకున్నాడు.
ఇప్పటికే ఎనిమిదేళ్లుగా ప్యూమాతో కలిసి విరాట్ పనిచేశాడు. కానీ ఇప్పుడు వచ్చిన రూ.300 కోట్ల డీల్‌ను కూడా అతను రిజెక్ట్ చేశాడు. 2017లో రూ.110 కోట్లకు సైన్ చేసిన అతడు, దాదాపు మూడు రెట్లు పెద్ద డీల్‌ను వదులుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ కోహ్లీకి ఇది వ్యాపార దృష్టితో తీసుకున్న నిర్ణయం అంటున్నారు.
ఇప్పుడు కోహ్లీ, Agilitas అనే కొత్త స్పోర్ట్స్‌వేర్ కంపెనీతో కలవబోతున్నాడు. ఇది ప్యూమా ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ స్థాపించిన కంపెనీ. వీరి సహకారంతో one8 బ్రాండ్‌ను అంతర్జాతీయంగా ఎదగించే ప్రయత్నాల్లో ఉన్నాడు కోహ్లీ.
ప్యూమా కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ – “విరాట్‌కు భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు. మా బంధం ఎంతో గొప్పగా సాగింది. భారత క్రీడాభివృద్ధిలో మేము ఇంకా పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తాం,” అని తెలిపింది.
ఇక ఐపీఎల్‌లో కోహ్లీ ఫామ్‌లోనే ఉన్నాడు. రాజత్ పాటీదార్ నాయకత్వంలోని RCB జట్టు ఐదు మ్యాచ్‌ల్లో మూడు గెలిచింది. కోహ్లీ KKR మీద అర్ధశతకం, ముంబయి మీద 67 పరుగులు చేసి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం బిజినెస్‌లోనూ కోహ్లీ ఆల్‌రౌండర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు!













