Homeపొలిటికల్వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఎందుకు తప్పించారంటే?

వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఎందుకు తప్పించారంటే?

ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సర కాలంలో ఏపీలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు నిరంతరం కష్టపడుతూ ముందుకెళుతున్నారు. ఈ ఏడాదికాలంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే ఆయన పార్టీలో తీసుకునే నిర్ణయాలు సంచలనంగా మారుతున్నారు. సొంత పార్టీ నేతలను సైతం అవాక్కయ్యేలా జగన్ నిర్ణయం ఆసక్తిని రేపుతోంది. తాజాగా పార్టీకి చెందిన ఓ కీలక నేతకు జగన్ జలక్ ఇవ్వడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Yv subba Reddy

వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్ గా జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇందులో భాగంగా పలు సంచనాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం కోసం అవసరమైతే తన బంధువులను సైతం పక్కన పెడుతాననే సంకేతాన్ని వైసీపీ శ్రేణుల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ తన బంధువైన వైవీ సుబ్బారెడ్డిని గుంటూరు, కృష్ణా జిల్లాల బాధ్యతల నుంచి తొలగించి సొంత పార్టీ నేతలే అవాక్కయ్యేలా చేశారు.

జగన్ ఓవైపు సంక్షేమంతో ప్రజలకు దగ్గరవుతూనే మరోవైపు పార్టీ బలోపేతానికి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. సమర్థవంతమైన నాయకులకు జిల్లాల బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఈమేరకు వైసీపీ కార్యాలయం నుంచి తాజాగా ఒక ప్రకటన విడుదలవడం ఆసక్తిని రేపుతోంది. ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పలు నిర్ణయాలు తీసుకున్నారు.. దీనిలో భాగంగా ఇక మీదట కృష్ణా-గుంటూరు జిల్లాల బాధ్యతలను మోపిదేవి వెంకటరమణ గారికి అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయి’ అని ప్రకటించారు.

ఇటీవలే వైఎస్ జగన్.. ఈ గుంటూరు, కృష్ణ జిల్లాల బాధ్యతలను దగ్గరి బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. కానీ కొద్దిరోజులకే ఆయన స్థానంలో మోపిదేవికి ఆ రెండు జిల్లాలను కేటాయించినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మోపిదేవి వెంకటరమణ ఏపీ సీఎం జగన్ కు నమ్మినబంటుగా ఉంటున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ తో నడించారు. దీంతో గెలవకున్నా ఆయనకు జగన్ మంత్రిని చేశారు. ఇటీవలే జగన్ మాట మేరకు మంత్రి పదవీకి రాజీనామా చేయడంతో ఏకంగా రాజ్యసభకు ఎంపీగా పంపారు. గుంటూరు-కృష్ణ జిల్లాల రాజకీయాలు మోపిదేవికి బాగా తెలియడంతో ఈ రెండు జిల్లాల బాధ్యతను జగన్ ఆయనకే కట్టబెట్టారు. దీంతో జగన్ నమ్మకస్తుడు, మంచి హార్డ్ వర్కర్ అయిన మోపిదేవికి ఇచ్చారన్న టాక్ వైసీపీలో నడుస్తోంది.

గతంలోనూ సీఎం జగన్ ఇలానే వ్యవహరించారు. సజ్జల రామకృష్ణ రెడ్డికి వైఎస్ జగన్ షాక్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు.. పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణరెడ్డికి వరుసగా రెండు షాకులిచ్చారు. రాయలసీమలోని కీలకమైన రెండు జిల్లాల బాధ్యతలను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇచ్చి సజ్జలను పక్కనపెట్టారు. తాజాగా మరోసారి గుంటూరు-కృష్ణ జిల్లాల బాధ్యతల నుంచి వైవీ సుబ్బారెడ్డిని తప్పించడం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu