HomeTelugu TrendingLucky Baskhar లో భాస్కర్ స్పెల్లింగ్ వెనుక ఇంత కథ ఉందా?

Lucky Baskhar లో భాస్కర్ స్పెల్లింగ్ వెనుక ఇంత కథ ఉందా?

Why Bhaskar Spelled As Baskhar in Lucky Baskhar?
Why Bhaskar Spelled As Baskhar in Lucky Baskhar?

Lucky Baskhar Title Mystery:

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా లక్కీ బాస్కర్ టైటిల్ విషయమై ప్రత్యేక చర్చ జరుగుతోంది. సాధారణంగా “భాస్కర్”గా ఉండే పేరు, ఇక్కడ “బాస్కర్”గా మార్చడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. టైటిల్‌లో ఈ స్పెల్లింగ్ మార్పు వెనుక ఉన్న కారణం ఏమిటని కొందరు అభిమానులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

దీని గురించి చిత్ర యూనిట్‌లోని ఓ సభ్యుడు స్పందిస్తూ, “మనకి Lucky B***ard అనే ఆంగ్ల పదం గురించి తెలుసు. ఈ పదం ఒక అసభ్య పదంగా ఉన్నా, అర్థంలో మాత్రం ఎంతో అదృష్టవంతుడిని అర్థం. అంటే, కొందరు వారి అర్హతకు మించి ఎదగగలిగినప్పుడు, వాళ్లను లక్కీ అలా అంటాం” అని చెప్పారు.

ఈ భావాన్ని సున్నితంగా వ్యక్తీకరించడానికి “బాస్కర్” అనే టైటిల్‌ని ఎంపిక చేశారట. ఇందులో అసభ్య పదం మొదటి మూడు అక్షరాలను ఉంచి ఈ ప్రత్యేకతను చూపించారు. మరిన్ని వివరాల్లోకి వెళ్లితే, ఈ పేరు తమిళంలో “బాస్కరన్” లేదా “బాస్కర్”గా వినిపిస్తుందని చెప్పారు. కానీ, ఉత్తరాది, తెలుగులో “భాస్కర్” అనే స్పెల్లింగ్ సాధారణంగా కనిపిస్తుంది. దీనితో పాటు, “లక్కీ బా..ర్డ్” పదంలోని అక్షరాల సంఖ్యకు సమానంగా ఉండేలా ఈ స్పెల్లింగ్‌ను మార్చారని తెలిపారు.

అయితే, ఇది నిజంగా టైటిల్ వెనుక ఉన్న నిజమైన కథా లేక మామూలు ఊహా అనేది క్లారిటీ ఇవ్వలేదు. టైటిల్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం గురించి దర్శకుడు లేదా నటుడు మరింత వివరణ ఇస్తారా అనేది వేచి చూడాలి.

Read More: Nandamuri Mokshagna సినిమాలో మరొక స్టార్ హీరో కూడా ఉన్నారా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu