ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్‌తో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ జనవరిలో ప్రారంభం కాబోతుంది. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఇది. బాహుబలి సినిమాలో హీరోగా ప్రభాస్ కు ఎంత పేరొచ్చిందో.. విలన్ పాత్ర చేసిన రానాకు అంతే పేరు వచ్చింది. ప్రభాస్ కంటే రానాకు ఇంకా ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. రానాతో సినిమా చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుందని రాజమౌళి
చాలాసార్లు చెప్పారు. విలక్షణమైన నటుడు కావడంతో.. రానాతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా విలన్ రోల్ చాలా కొత్తగా, పవర్ ఫుల్‌గా ఉండబోతుందట. హీరోతో సమానంగా విలన్ రోల్ ఉంటుందట. విలన్ రోల్ కోసం ఇప్పటికే రాజమౌళి చాలా మందిని సంప్రదించారు. కన్నడ రాక్ స్టార్ యాష్ ను విలన్ గా తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై రాజమౌళి టీమ్ ఇంతవరకూ స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త చక్కర్లు కొడుతుంది. ఆర్ఆర్ఆర్ లో విలన్ రోల్ ను రానా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో రానాతో పాటు యాష్ కూడా మరో విలన్ రోల్ ప్లే చేస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది. బాహుబలి సినిమాలా దీనిని రెండు పార్టులుగా తీస్తే బాగుంటుందని.. నిర్మాతలకు కూడా సేఫ్‌గా ఉంటుందనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు చెబుతున్నారు.