HomeTelugu Trending'ఎఫ్‌3' రెడీ.. మూడో హీరో ఎవరంటే..

‘ఎఫ్‌3’ రెడీ.. మూడో హీరో ఎవరంటే..

6 18
విక్టరీ వెంకటేష్‌, వరుణ్ తేజ్‌ హీరోలుగా, తమన్నా, మోహ్రిన్‌ హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘ఎఫ్ 2’. 2019 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమా దిల్ రాజుకు భారీ లాభాలు తీసుకొచ్చింది. సినిమాకు పక్కా ఫన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫన్ క్రియేట్ కావడంతో మస్త్ హిట్ కొట్టింది. కాగా, అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తామని దిల్ రాజు చెప్పారు. చెప్పినట్టుగానే సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారని సమాచారం.

అనిల్ రావిపూడి ఈ సినిమా తరువాత ‘సరిలేరు నీకెర్వరు’ సినిమా చేశారు. ఇది మంచి వసూళ్లు రాబట్టింది. మహేష్ బాబుతో మరో సినిమా ఉంటుందని ప్రకటించారు. ఈ మధ్యలో అనిల్ మరో సినిమా చేయబోతున్నారు. అదే ఎఫ్ 3. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ను అనిల్ సిద్ధం చేస్తున్నారట. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటుగా మరో స్టార్ కూడా ఉండబోతున్నారట. ఆయనే ఎవరంటే.. మాస్ మహారాజ రవితేజ అంటున్నారు. అయితే అథికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu