ప్రముఖ నటి సమంత ప్రాధన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జెఆర్సి కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్‌గా జరగబోతున్నది. జులై 5 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు హైప్క్రియేట్ కావడంతో ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. 20 ఏళ్ల యువతి శరీరంలోకి 70 సంవత్సరాల బామ్మ ఆత్మ ప్రవేశిస్తే ఏం జరుగుతుంది.. ఆ యువతితో ఎలాంటి మార్పులు వస్తాయి అనే దాన్ని ఆధారంగా ఫన్నీగా చూపించబోతున్నారు. రేపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అన్నది సస్పెన్స్ గా ఉంచారు. సురేష్ ప్రొడక్షన్స్ లో వస్తున్న సినిమా కాబట్టి స్పెషల్ గెస్ట్ కూడా స్పెషల్ గా ఉంటారని సమాచారం.