బిగ్‌బాస్ మొదటి వారంలో హేమను ఇంటికి పంపించిన బిగ్‌బాస్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రిని హౌస్‌లో ప్రవేశపెట్టాడు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం, నారా లోకేష్ విషయంలో తమన్నాకు ఒక్కసారిగా గుర్తింపు వచ్చేసింది. అంతేకాకుండా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా తమన్నా పోటీ చేసింది.
‘ఎవరైనా తనను తాను నిరూపించుకోవడానికి చేసే యుద్దాన్ని కేవలం రెండక్షరాల్లో చెప్పే చిన్నమాట నేను. అతనిలో నేను ఆమెలా ఉంటూ.. గుర్తింపు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా చేతి గాజులు గీసే గీతలు దాటుతూ.. గడియారం చేతులు చూపే సమయంతో మారుతూ వచ్చాను. ఇప్పటికీ చాలా మంది నన్ను అడిగే మొదటి ప్రశ్న నేనెవరు? కుటుంబం భయంతో మోసే బరువును కాను.. ధైర్యంతో ఓ కొత్త కుటుంబాన్ని గెలుచుకునే బంధాన్ని నేను. వీళ్లేం చేస్తారులే అని చులకనగా చూసే సమాజాన్ని కాను.. సవాలు చేసి సమరం సాగించే సైన్యాన్ని నేను.. నిజానికి నేనువరు? నాకు తెలుసు. నాకు మాత్రమే తెలిసిన నన్ను మీకు పరిచయం చేయడానికి నాకు వచ్చిన అవకాశమే బిగ్‌బాస్’ అంటూ తన మనసులో మాటలు చెప్పుకుంటూ తమన్నా సింహాద్రి స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ తమన్నా ఎవరు అన్న చర్చ జనాల్లో మొదలైంది. తమన్నా సింహాద్రికి సంబంధించిన వివరాలు
*తమన్నా సింహాద్రి స్వస్థలం కృష్ణాజిల్లా అవని గడ్డ. ఆమె అసలు పేరు సింహాద్రి మస్తాన్. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈమెకు టీడీపీ సీనియర్ నేత,మాజీ దేవాదాయ
శాఖ మంత్రి సింహాద్రి సత్యనారాయణ పెదనాన్న అవుతారు.
*యూపీలోనే కాదు, ఏపీలోనూ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి పోటీలో ఉన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తమన్నా సింహాద్రి పోటీ చేస్తున్నారు.
సినిమాల్లో రాణించాలన్న కోరికతో కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చిన తమన్నా.. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో ముంబైకి కూడా వెళ్లారు. అక్కడే లింగమార్పిడి
ఆపరేషన్ చేయించుకున్నారు.
*ముంబైలోనే కొన్నాళ్లు జాబ్ చేసిన తమన్నా.. వీకేర్ కంపెనీ నిర్వహించిన ఓ ఫ్యాషన్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.శ్రీరెడ్డి చేపట్టిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి మద్దతుగా
ఉండి వార్తల్లో నిలిచారు.