భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హైదరాబాద్ నియోజకవర్గానికి లోక్‌సభ అభ్యర్థిగా మాధవీ లతను ఎన్నుకుంది, అక్కడ ఆమె ఎంఐఎం యొక్క బలీయమైన అసదుద్దీన్ ఓవైసీని ఎదుర్కొంటుంది. సలావుద్దీన్ ఒవైసీ మరియు తరువాత అతని కుమారుడు అసదుద్దీన్ ప్రాతినిధ్యం వహించడంతో 1984 నుండి ఈ నియోజకవర్గంలో ఎంఐఎం బలమైన పట్టును కలిగి ఉంది. ఇప్పుడు వారితో పోటీ పడబోతున్నారు మాధవీ లత. దీంతో ఎవరీమె..? ఈమె బ్యాగ్రౌండ్ ఏంటి..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈమె గురించి గూగుల్‌తో తెగ సర్చ్ చేస్తున్నారు.
ఆమె గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందా.. ప్రముఖ విరించి ఆస్పత్రుల చైర్ పర్సన్ కొంపెల్లి మాధవీ లత. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన చురుకైన హిందుత్వ కార్యకర్త మాధవీ లత. ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి కూడా మరియు పెద్దవారు ఇప్పుడు IITలో ఉన్న వారితో పాటు తన పిల్లలకు హోమ్‌స్కూల్ చేయడం ద్వారా దృష్టిని ఆకర్షించారు.
ఈమె రిలిజీయస్ యాక్టివిటీస్‌లో చురుకుగా పాల్గొంటూ ఉండేవారు. ఎన్ఎసీసీ క్యాడెట్‌గా.. భరతనాట్య నర్తకీగా.. క్లాసికల్ మ్యూజికల్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె లతామా ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ కూడా. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. మోడీ నాయకత్వానికి ఆకర్షితురాలైన మాధవీ బీజేపీ లో చేరారు.
నాటి నుంచి పాతబస్తీలో ఎవరికెలాంటి సమస్య వచ్చినా పరిష్కారం చూపిస్తూ వస్తున్నారు. పాతబస్తీలో తరుచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతూ ప్రజలతో మమేకం అవుతుంటారు. నిత్యం ప్రజల్లో ఉంటున్న మాధవీకి టికెట్ ఇస్తే బాగుంటుందని రాష్ట్ర నాయకత్వం నుంచి ఢిల్లీ పెద్దలకు ఓ నివేదిక వెళ్లడంతో.. అభ్యర్థిత్వాన్ని పరిశీలించి టికెట్ ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఎదురులేని నేతగా ఓవైసీని గట్టి దెబ్బ కొట్టాలన్నది బీజేపీ ప్లాన్. అందుకే ఈసారి అసద్‌ను ఓడించాలని నారీ శక్తిని రంగంలోకి దింపింది బీజేపీ. నిజానికి ఇప్పటికే రెండు మూడు సార్లు బీజేపీ అభ్యర్థి రెండో స్థానందక్కించుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఓవైసీనీ ఓడించాల్సిందేనని ఆర్థిక బలం, అంగ బలం అన్ని విధాలుగా సరైన వ్యక్తిగా ఉన్న మాధవీలతను బీజేపీ బరిలోకి దింపిందని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న మాధవీలతను తెరపైకి తెచ్చింది బీజేపీ. ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి మరి.