
Thug Life cast:
తమిళ స్టార్ హీరో సిలంబరసన్ TR (STR) జన్మదినం ఫిబ్రవరి 3న అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అయితే, ఈ సారి ఆయన పుట్టినరోజు మరింత స్పెషల్ అయింది! ఎందుకంటే, STR తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై మేజర్ అప్‌డేట్స్ ఇచ్చారు. ప్రత్యేకంగా, కమల్ హాసన్ – మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’లో STR క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అయితే, STR కూడా ఇందులో ఓ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. జన్మదిన కానుకగా, సినిమా టీమ్ STR గ్లింప్స్ విడుదల చేయగా, అది నెట్టింట ట్రెండింగ్ అయ్యింది.
సినిమా హీరో కమల్ హాసన్ గురించి కాకుండా ఫ్యాన్స్ మాత్రం STR లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ అన్నీ హై-క్వాలిటీగా ఉండటంతో, ‘థగ్ లైఫ్’ ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్ మూవీలా ఉందని అంటున్నారు. దీంతో సినిమాలో అయినా కమల్ పాత్ర హైలైట్ అవుతుందా లేదా అని టాక్ వినిపిస్తోంది.
‘థగ్ లైఫ్’ మాత్రమే కాదు, STR తన 49వ, 50వ చిత్రాల గురించి కూడా అఫీషియల్‌గా ప్రకటించాడు.
#STR49 – ‘పార్కింగ్’ ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్.
#STR50 – ఈ సినిమాకి దేశింగ్ పెరియసామి డైరెక్టర్, మరో విశేషం ఏమిటంటే – STR ఈ సినిమాను తన స్వంత ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మించబోతున్నాడు!
ఈ అప్‌డేట్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ! STR కెరీర్‌లో నెక్స్ట్ 2-3 ఏళ్లు మైండ్ బ్లోయింగ్ ఉండబోతున్నాయి అని చెప్పొచ్చు. సమాంతరం గా వేరే లెవెల్ లో ఉన్న STR, అన్న రేంజ్‌లో ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.