ఈ రోజుల్లో అసలు కంటే కొసరు ముఖ్యమని తీసే సినిమాలో మ్యాటర్ సంగతి పక్కనపెడితే..టీజర్‌లో బోల్డ్ సన్నివేశాలను ఎక్కువగా చూపిస్తూ సినిమాకు ఫుల్ క్రేజ్ తీసుకొస్తున్నారు ఇప్పటి దర్శక, నిర్మాతలు. ఇప్పటికే ఈ తరహా బూతు టీజర్లు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ రాబట్టి వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ’ చిత్రంలో పూజిత హాట్ వీడియో ఇపుడు యూట్యూబ్‌ను సెగలు పుట్టిస్తోంది. రాయ్ లక్ష్మీ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో పూజిత పొన్నాడ, కార్తిక్, ప్రవీణ్, మధునందన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పటికే రాయ్ లక్ష్మీ అందాలపై ఆధారపడి తెరకెక్కించిన ఈ సినిమాలో పూజిత చేసిన హాట్ షో ఆడియన్స్‌కు కిక్కేంచేలా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి నాలో అనే రొమాంటిక్ సాంగ్ టీజర్‌ను విడుదల చేసారు.ఈ పాటలో పూజిత అందాల ఆరబోత మాములుగా లేదుగా..ఓ రేంజ్‌లో చూసినవాళ్లకే సెగలు పుట్టిస్తోంది. ఇపుడీ బూతు వీడియో సోషల్ మీడియాతో పాటు సెన్సార్ వాళ్లు ఈ విషయమై ఏమి చేస్తున్నారనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇదంత ఓకే కానీ..సెన్సార్ వాళ్లు ఈ విషయమై చూసి చూడనట్టు వ్యవహరిస్తారా లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అనేది చూడాలి.