
Rambha Family Issues:
90’s కుర్రాళ్ల క్రష్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, దశాబ్దానికి పైగా అగ్రనాయికగా వెలుగొందింది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పిన రంభ, తాజాగా మళ్లీ బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చింది.
చిన్న వయస్సులోనే హీరోయిన్‌గా మారిన రంభ, తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2010లో కెనడా బిజినెస్‌మెన్ ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకున్న ఆమె, భర్తతో కలిసి అక్కడే సెటిల్ అయిపోయింది. కానీ, చాలా ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
ఇటీవల ఓ టీవీ షోలో రంభ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. భర్తతో చిన్న గొడవ కారణంగా ఒక్క మాట చెప్పకుండా కెనడా నుంచి చెన్నైకి వెళ్లిపోయిందట! ఫ్లైట్ ఎక్కిన తర్వాతే తన కుటుంబానికి ఈ విషయం చెప్పడంతో, వాళ్లు చాలా షాక్ అయ్యారట. ఇక, భర్త సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె కోసం కెనడా మొత్తం వెతికాడట!
ఇప్పుడు రంభ రెండో ఇన్నింగ్స్‌ను టీవీ షోతో మొదలు పెట్టింది. చిన్న తెరపై తన చలాకీతనాన్ని చూపిస్తూ, అభిమానులను మళ్లీ అలరిస్తోంది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ALSO READ: కార్తిక్ ఆర్యన్ సినిమా నుంచి Sreeleela ఔట్? కారణం అదేనా?