HomeTelugu NewswhatsApp: సరికొత్త ఫీచర్‌.. ఈ సమస్యకు చెక్‌

whatsApp: సరికొత్త ఫీచర్‌.. ఈ సమస్యకు చెక్‌

WhatsApp working on new fea

WhatsApp working on new features: ఈ రోజుల్లో ప్రతీ ఒక్క స్మార్ట్‌ ఫోన్‌ మరియు వాట్సాప్‌ ఉండని వారు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌ కూడా ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా వాట్సాప్‌ యూజర్ల కోసం ఓ ఆసక్తికర ఫీచర్‌ను పరిచయం చేస్తోంది.

వాట్సాప్‌లో టైపింగ్‌కు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో వాయిస్‌ మెసేజ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సహాయంతో క్షణాల్లో వాయిస్‌ మెసేజ్‌ను చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే వాయిస్‌ మెసేజ్‌ను కొన్ని సందర్భాల్లో అందరి ముందు వినే అవకాశం ఉండకపోవచ్చు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

వాయిస్‌ నోట్ ట్రాన్‌స్క్రిప్షన్‌ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ సహాయంతో వాయిస్‌ మెస్‌లను టెక్ట్స్ రూపంలో మార్చుకోవచ్చు. దీంతో ఆడియో మెసేజ్‌ను వినకుండానే మెసేజ్‌ను చదివి తిరిగి రిప్లై ఇవ్వొచ్చన్నమాట. ఇదిలా ఉంటే వాట్సాప్‌ ఇప్పటికే ఈ కొత్త ఫీచర్‌ను కొందరు ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకీ తీసుకొచ్చారు.

ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఫీచర్‌ కోసం యూజర్లు అదనంగా 150ఎంబీ యాప్‌ డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాయిస్‌ నోట్స్‌ను టెక్ట్స్‌లోకి మార్చడానికి డివైజ్‌ స్పీచ్‌ రికగ్నిషన్‌ ఫీచర్లను వాట్సప్‌ వాడుకుంటుంది.

ప్రైవసీ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాట్సాప్‌ చెబుతోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించే వారికి మెసేజ్‌ బబుల్స్‌లో వాయిస్‌ నోట్స్‌ టెక్ట్స్‌ రూపంలో కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారన్న దానిపై వాట్సాప్‌ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu