చాలామందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. ఇది నిజం. ప్రతిరోజూ చికెన్, మటన్..ఇలా రకరకాల వెరైటీస్ ఉండాల్సిందే. అయితే నిత్య జీవితంలో చికెన్ అధికంగా తిననేవారు చాలా మంది ఉన్నారు. దీన్ని అధికంగా తినడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చికెన్ తింటే శరీరంలో ప్రొటీన్స్ పెరుగుతాయి. ప్రొటీన్ వల్ల శరీర ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫలితంగా అనేక వైరస్ లను ఎదుర్కొనే శక్తి మన శరీరానికి అందుతుంది. అయితే కోళ్ల ఫారల్లో పెంచే కోళ్లను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
చికెన్ తింటే శరీరానికి ప్రొటీన్ అందుతుంది. అది ఆరోగ్యం కదా అని రోజూ తింటే కొన్ని అనారోగ్యాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చికెన్లో ప్రొటీన్ కంటెంట్ అధికంగా ఉండటంతో.. రోజూ తినడం వల్ల కొవ్వు రూపంలో మారి శరీరంలో పేరుకుపోతుంది. దీంతో క్రమంగా బరువు పెరుగుతారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో లిపిడ్ స్థాయిలు కూడా అధికంగా పెరిగిపోతాయి. చికెన్ వంటి అధిక ప్రోటీన్ ఆహారాలను అతిగా తినడం వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అకాల మరణం సంభవిస్తుంది. కాగా పచ్చి చికెన్‌పై సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టిరియాలు ఉంటాయి. చికెన్‌ను ముట్టుకుంటే అవి చేతులకు అంటుకుని పొట్టలోనికి ప్రమాదం కూడా ఉంటుంది. పౌల్ట్రీ రైతులు కోళ్లకు ఇచ్చే యాంటీబయోటిక్ ఇంజెక్షన్ల వల్ల.. చికెన్ తినేవారిలో యాంటీబయోటిక్స్ నిరోధకత పెరిగుతుంది. ఆ తర్వాత ఏదైనా అనారోగ్య బారిన పడితే వైద్యులు సూచించే మందులు వారి శరీరాలపై ఎలాంటి ప్రభావం చూపవు.
అందువల్ల బ్రాయిలర్ కోళ్లను తినడం కంటే నాటు కోళ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఈ రోజుల్లో నాటు కోళ్లు ఎక్కడ దొరకుతాయకుంటే..చికెన్ రోజూ కాకుండా వారానికి రెండు, మూడు సార్లు తినమని నిపుణులు చెబుతున్నారు. చికెన్ రోజూ తినే అలవాటు ఉంటే మాత్రం పద్ధతి మార్చుకోవల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, మాంసం, చేపలు వారానికి రెండుసార్లు తిన్నా చాలు..మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి.
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు