లాక్ చేసిన ఫోన్‌ను పాస్‌వర్డ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీతో అన్‌లాక్ చేయొచ్చు. అలా అన్‌లాక్ చేసిన ఫోన్‌లోని చాలా యాప్స్‌ను (వాట్సాప్‌తో సహా) యథేచ్ఛగా ఎవరైనా వాడవచ్చు. ఇలాంటి వాటికి ఇక వాట్సాప్ చెక్ చెప్పనుంది. యూజర్లకు మేలు చేసేలా ఇప్పటికే అనేక సరికొత్త ఫీచర్లతో వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వస్తోంది ఫేస్‌బుక్. కాగా, త్వరలోనే మరికొన్ని సరికొత్త ఫీచర్లను వినియోగదారుల కోసం తీసుకొస్తోంది.
వాట్సాప్‌ను ఓపెన్ చేయాలంటే కచ్చితంగా బయోమెట్రిక్ ధ్రువీకరణ ఉండాల్సిందే. అంతేకాదు, వాట్సాప్ సందేశాలను స్క్రీన్ షాట్ తీయాలంటే కూడా కచ్చితంగా ఫింగర్‌ప్రింట్‌ను యాక్సెస్ చేయాల్సిందే. ఈ ఫీచర్లను వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. అయితే, స్క్రీన్‌షాట్స్‌కు ఫింగర్‌ప్రింట్ ఆప్షన్ తప్పనిసరి కాదు. వినియోగదారులు స్క్రీన్‌షాట్స్ తీయడానికి అనుమతి కావాలా? వద్దా? అన్నది ఎంచుకోవాల్సి ఉంటుంది. కావాలనుకుంటేనే ఆ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు డూడుల్ యూఐని కూడా వాట్సాప్ అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా స్టికర్స్, ఎమోజీలను స్నేహితులతో పంచుకోవచ్చు.