ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో సుపరిచితుడైన వల్లభనేని వంశీ మోహన్ గన్నవరంలో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల నుంచి బీవీఎస్సీ మరియు ఎంవీఎస్సి లను పూర్తి చేశాడు. కమ్యూనిస్టు నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించిన వంశీ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూనే కమ్యూనిస్టు అనుబంధ ఉపాధ్యాయ సంఘంలో పనిచేశారు. వంశీ తన ఉన్నత విద్యను పూర్తి చేశాక, ఆనాటి రాజకీయ సంచలనం మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు చేరువయ్యాడు. పరిటాల రవీంద్ర అనుచరుడిగా ఉంటూనే తన మిత్రుడు కొడాలి నాని ద్వారా నందమూరి హరికృష్ణ కుటుంబంతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు.
ఐతే, పరిటాల హత్య తర్వాత తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగంలో అడుగుపెట్టిన వంశీ 2009లో జూనియర్ ఎన్టీఆర్ సహకారంతో తెలుగుదేశం పార్టీ విజయవాడ లోక్ సభ టికెట్ ను దక్కించుకుని ఓటమి పాలైయ్యాడు. పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ ప్రోత్సాహంతో 2014, 2019 లలో ఆ పార్టీ నుంచి గన్నవరం నియోజకవర్గంలో పోటీ చేసి వంశీ విజయం సాధించడం జరిగింది. ఐతే, 2019లో తన వ్యక్తిగత అవసరాలు మరియు స్నేహితుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రోద్బలంతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండుకున్నాడు. వంశీ తొలి నుంచి వివాదాస్పద రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత దూషణలు చేసి ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు.
ఐతే, ప్రస్తుతం వల్లభనేని వంశీ తన మనసు మార్చుకున్నారా ?, వైసీపీలోకి వచ్చి తప్పు చేశానని ఫీలవుతున్నారా ? ఆ మాటను బయట పెట్టలేక, ఎవరితో షేర్ చేసుకోలేక సతమతమవుతున్నారా ?, నిన్నా మొన్నటి దాకా చంద్రబాబు, లోకేష్ తెలుగుదేశానికి పట్టిన తెగులు అంటూ ఉతికి ఆరేసిన వంశీ అనూహ్యంగా మాట మార్చారన్న ప్రచారం ఊపందుకుంది. గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆ పార్టీకి హ్యాండిచ్చి వైసీపీ కాంపౌండ్‌లోకి అడుగు పెట్టిన వంశీ… ఇప్పుడు టీడీపీని వెనకేసుకొస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ తెలుగుదేశం పార్టీ విషయంలో వంశీ ఎందుకు రూట్ మార్చారు? అనూహ్యంగా టీడీపీపై ఆయనకు ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది? టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన తాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అయిన ప్రశ్చాత్తాపపడుతున్నారా? లేక వైసీపీకి బాయ్‌బాయ్ చెప్పే ఆలోచనలో ఉన్నారా? ఈ అంశాల చుట్టే ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఇక వల్లభనేని వంశీ గ్రాఫ్ సూస్తే.. ఈ సారి వల్లభనేని వంశీ గెలుపు అసాధ్యమే.