Homeపొలిటికల్కోటంరెడ్డి పరిస్థితేంటి ? , వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి గ్రాఫ్ ఇదే !

కోటంరెడ్డి పరిస్థితేంటి ? , వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి గ్రాఫ్ ఇదే !

What is the status of Kotamreddy this is Kotamreddys graph in the next election

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ప్రస్తుతం ఈ పేరు ఆంధ్రాలో హాట్ టాపిక్ అయ్యింది. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యేగా కంటే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి వైఎస్ జ‌గ‌న్ అనుచరుడిగానే ఫేమస్ అయ్యారు. ఇక్కడే కోటంరెడ్డి ఫీల్ అయినట్టు తెలుస్తోంది. తాను ఇన్నాళ్లు జగన్ కి సన్నిహితుడ్ని అనుకుంటే.. జగన్ మాత్రం కోటంరెడ్డిని ఒక అనుచరుడిగానే చూశారు. అందుకే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం జగన్ సర్కార్ పైకే సవాల్ విరుసుతున్నాడు. త‌న వ‌ద్ద 12 సిమ్‌ కార్డులున్నాయ‌ని, వాటిని ట్యాప్ చేసేందుకు చేత‌నైతే ఐపీఎస్ అధికారితో నిఘా పెట్టాల‌ని కోటంరెడ్డి స‌వాల్ విసర‌డం అంటే ప‌రోక్షంగా జగన్ రెడ్డిని హెచ్చ‌రించిన‌ట్టే. అసలు కోటంరెడ్డి వ్య‌వ‌హార‌శైలి ఎందుకు సడెన్ గా ఇలా మారిపోయింది ?, జగన్ ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు ?, నిజానికి కోటంరెడ్డి మొద‌టి నుంచి జగన్ వెంటే న‌డుస్తున్నారు. నమ్మిని వ్యక్తి నమ్మకాన్నే కాపాడుకోలేకపోయాడు జగన్ రెడ్డి.

మొత్తానికి కోటంరెడ్డి వ్యూహాత్మ‌కంగానే వైసీపీ పార్టీకి న‌ష్టం క‌లిగిస్తున్నార‌నే నిర్ణ‌యానికి వైసీపీ పెద్ద‌లు వ‌చ్చారు. దీని వెనుక ఎవరు ఉన్నారు ?, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు ఇలా మారిపోయాడు ? అనే విషయాల్లో ప్రధానంగా కనిపించే అంశం. జగన్ తీరు. అలాగే జగన్ పాలన విధానం. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమనే అభిప్రాయానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. పైగా జగన్ సీఎం అయ్యాక తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిన తీరుకి ఆయన కలత చెందారు. పైగా జగన్ బొమ్మ పెట్టుకుంటే.. తన వాళ్ళు కూడా తనకు ఓట్లు వేసే పరిస్థితి లేదని కోటంరెడ్డి సర్వేలో తేలింది. ఈ క్రమంలోనే కోటంరెడ్డి జగన్ పై సీరియస్ గా ఉన్నారు. విమర్శలు చేస్తూ సవాల్ విసురుతున్నారు.

ఇంతకీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితేంటి ? , వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, ఇంతకీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేపథ్యం ఏమిటి చూద్దాం రండి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుపతి లో జన్మించారు. స్వస్థలం మాత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెం గ్రామం. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం శ్రీధర్ రెడ్డి నెల్లూరు వి. ఆర్. కళాశాలలో బీకాం పూర్తి చేశారు. శ్రీధర్ రెడ్డి విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించారు. ఆర్.ఎస్.ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పని చేశారు. వి. ఆర్. కళాశాల అధ్యక్షుడిగా, తిరుపతి ఎస్వీయూ సెనేట్ మెంబర్ గా పనిచేశారు. విద్యార్థి దశ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి నెల్లూరు పట్టణ రాజకీయాల్లో ద్వితీయ శ్రేణి నాయకుడి నుంచి కీలకమైన నాయకుడిగా ఎదిగారు. 2011లో జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని నెల్లూరు రూరల్ నుండి 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శ్రీధర్ రెడ్డి మంచి వక్త, అనేక అంశాలపై అవలీలగా మాట్లాడే సత్తా ఉన్న నాయకుడిగా పేరుంది.

శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు ఎన్నికైనా జగన్ తన మంత్రివర్గంలో స్థానం మాత్రం ఇవ్వలేదు. ఆ బాధే శ్రీధర్ రెడ్డిలో ఎక్కువ ఉంది అంటుంటారు. పైగా తన నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గానికి కోరిన నిధులను కూడా జగన్ ఇవ్వలేదని కోటంరెడ్డి బాగా అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డికి మంచి పట్టు ఉంది. కానీ, వైసీపీ తరుపున పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ తక్కువ. టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీ తరపున పోటీ చేస్తే.. గెలుపు గ్యారంటీ అని నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ ప్రజలే భావిస్తున్నారు. బహుశా అందుకే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా జగన్ ప్రభుత్వానికి దూరం అవుతున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu