ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. గద్దె రామ్మోహన్ రావు. ప్రస్తుతం ప్రజల్లో గద్దె రామ్మోహన్ రావు పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. కృష్ణా జిల్లా రాజకీయాల్లో జెంటిల్మెన్ గా ప్రసిద్ధుడైన గద్దె రామ్మోహన్ రావు ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం లో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం గన్నవరం లోని వి.కె.ఆర్ కళాశాలలో బీఎస్సీ , ధార్వాడ్ విశ్వవిద్యాలయం నుంచి ఏం ఎస్సీ మైక్రో బయాలజీ పూర్తి చేశారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కంపెనీలో శాస్త్రవేత్త గా పనిచేశారు. అనంతరం, తానే స్వయంగా వ్యాపార రంగంలో ప్రవేశించి తన భార్య అనురాధ తో కలిసి ఆక్వా సీడ్ తయారీ పరిశ్రమను స్థాపించారు. అనంతర కాలంలో ఫార్మా మరియు ఇతరత్రా వ్యాపారాలను నిర్వహించారు.
గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీ లో కొనసాగుతున్నారు. 1994లో తెలుగుదేశం పార్టీ తరఫున గన్నవరం టిక్కెట్ ఆశించినా దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999 లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర పై సంచలన విజయం సాధించారు. గద్దె రామ్మోహన్ రావు 2004 కంకిపాడు నియోజకవర్గంలో, 2009 విజయవాడ తూర్పు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014, 2019 లలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎం.ఎల్.ఏ గా ఎన్నికయ్యారు.
ఇంతకీ, రాజకీయ నాయకుడిగా గద్దె రామ్మోహన్ రావు గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో గద్దె రామ్మోహన్ రావు పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ రావు పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ గద్దె రామ్మోహన్ రావుకి ఉందా ?, చూద్దాం రండి. గద్దె రామ్మోహన్ రావు గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అన్ని పార్టీల నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల్లో గద్దె రామ్మోహన్ రావుకి వ్యక్తిగత విమర్శలకు చేయడానికి ఇష్టపడరు. 2019 ఎన్నికల్లో జగన్ హవాలో సైతం విజయం సాధించడానికి గద్దె రామ్మోహన్ రావు ప్రవర్తనే కారణం.
పైగా గద్దె రామ్మోహన్ రావుకు వ్యక్తిగతంగా మంచి పేరుతో పాటు బలమైన అభిమానగణం ఉంది. ముఖ్యంగా గద్దె రామ్మోహన్ రావు రాజకీయ చరిత్రలో భూ కబ్జాలు, ఎలాంటి అవినీతి వ్యవహారాలు వంటి ఏమీ లేవు. తన గుర్తింపును, పేరును గద్దె రామ్మోహన్ రావు అలాగే నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ రావు గెలవడం ఖాయమే. రామ్మోహన్ రావు భార్య అనురాధ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేశారు. వీరిద్దరూ సొంతంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుకి బాగా ప్లస్ కానుంది.