
Vijay Deverakonda Next Movie:
నిఖిల్ నాగేశ్ భట్ దర్శకత్వం వహించిన ‘Kill’ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యంత హింసాత్మక యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా, ప్రేక్షకులు దీనిని బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఈ దర్శకుడి తదుపరి ప్రాజెక్టుపై ఉంది.
తాజాగా ఒక వెబ్సైట్ వారి ప్రత్యేక సమాచారం ప్రకారం, నిఖిల్ నాగేశ్ భట్ రెండు వారాల క్రితం హైదరాబాద్ వచ్చి విజయ్ దేవరకొండతో భేటీ అయ్యారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ భేటీకి కరణ్ జోహర్ వెనుక ఉన్నట్లు సమాచారం. కరణ్ జోహర్ ఇచ్చిన సలహా మేరకు డైరెక్టర్ విజయ్‌ను కలిశారని టాక్. ఇద్దరూ కలిసి పని చేయాలనే ఆసక్తి చూపించారని తెలుస్తోంది.
అయితే, ఇది ఇంకా ప్రాథమిక చర్చలు మాత్రమే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘Kingdom’ చివరి షెడ్యూల్‌లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో శ్యామ్ సింఘ రాయ్ డైరెక్టర్‌తో ఒక సినిమా, అలాగే దిల్ రాజు బ్యానర్‌లో ‘Raja Vaaru Rani Gaaru’ డైరెక్టర్‌తో మరొక సినిమా చేయాల్సి ఉంది.
ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి కొంత సమయం పడొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, కరణ్ జోహర్ మద్దతుతో విజయ్, నిఖిల్ భట్ కలయికలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోందని భావిస్తున్నారు.