HomeTelugu TrendingPawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది?

Pawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది?

What happened to Pawan Kalyan - NTR multistarrer movie?
What happened to Pawan Kalyan – NTR multistarrer movie?

Pawan Kalyan multistarrer movie:

టాలీవుడ్ లో ఎప్పటికీ ఉండే ఎవర్ గ్రీన్ ట్రెండ్ ఏదైనా ఉంది అంటే.. అది మల్టీస్టారర్ సినిమాలు అని చెప్పుకోవచ్చు. ఇద్దరు స్టార్లు కలిసి సినిమా చేస్తే అది.. ఇరు హీరోల అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది. అలాంటి మల్టీ స్టారర్ సినిమాలు.. ఇప్పటికే టాలీవుడ్ లో చాలానే వచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడు స్టార్ హీరోలు ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని.. ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

పవన్ కళ్యాణ్ – వెంకటేష్, చిరంజీవి – రవితేజ, పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి, నాని – నాగార్జున.. ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు చూసేసాం. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఒకటి మాత్రం వెలుగు చూడలేకపోయింది. అదే పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ల కాంబినేషన్. ఒక స్టార్ డైరెక్టర్ ఇద్దరు హీరోలను పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేశారట.

ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఇద్దరికీ సరిపోయేలాగా ఒక అదిరిపోయే స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట. ఆ కథ కూడా ఇద్దరు హీరోలకి చాలా బాగా నచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది.

ఒకవేళ ఆ సినిమా పూర్తయి.. రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం.. కచ్చితంగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోలతోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మంచి స్నేహం ఉంది. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ ని ఒక స్టైలిష్ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో చూపించినట్టు ఇంకెవరూ చూపించలేదేమో. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రంల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Read More: Pawan Kalyan పగలు నటుడిగా మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రిగా

పవన్ కళ్యాణ్ హీరో గా త్రివిక్రమ్ జల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. ఇద్దరితో విడిగా సూపర్ హిట్ సినిమాలు తీసిన త్రివిక్రమ్.. ఇద్దరితో మల్టీ స్టారర్ సినిమా మాత్రం పూర్తి చేయలేకపోయారు అని ఫాన్స్ బాధపడుతూ ఉంటారు. మరి భవిష్యత్తులో అయినా ఇద్దరు హీరోలు కలిసి.. ఏదైనా సినిమా చేసే అవకాశం ఉండొచ్చేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu