తెలుగు బిగ్‌బాస్-3 నుంచి బయటకు వచ్చేసిన నటి పునర్నవి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో రిలేషన్‌పై స్పష్టత ఇచ్చింది. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో దీనిపై ఓ ఇంటర్వ్యూలో పున్నూ స్పందించారు. రాహుల్ నాకు మంచి స్నేహితుడు.. ఆ షోలో అతడితో ఎక్కువగా గొడవపడేదాన్ని.. అందుకే అందరూ మేము ప్రేమలో ఉన్నామని అనుకుంటున్నారు. మా ఇద్దరి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం ఉంది. అయితే మొదట్లో నేను రాహుల్‌ను నాకు దూరంగా ఉండాలని చెప్పాను. మా ఇద్దరిపై రూమర్స్ రావడం నాకు చాలా బాధేసింది. తర్వాత వాళ్ల మాటలను పట్టించుకోవడం మానేశానని చెప్పింది.