HomeTelugu Big Storiesఏప్రిల్ 14 తర్వాత భారత్‌లో పరిస్థితులు ఏమిటి?

ఏప్రిల్ 14 తర్వాత భారత్‌లో పరిస్థితులు ఏమిటి?

1a
ఏప్రిల్ 14 తర్వాత దేశంలో పరిస్థితి ఏంటి? తర్వాత ప్రజలంతా రోజువారీ పనుల్లో మునిగిపోవచ్చా? కరోనాను మనం జయించినట్టేనా? దీనిపై పలురకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 తర్వాత ఎత్తివేస్తారా? లేక ఇంకా పొడిగిస్తారా? ఇప్పుడు అందరిలో ఇదే చర్చ నడుస్తోంది. లాక్‌డౌన్‌పై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం జోక్యం చేసుకుని ఓ ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 14 తర్వాత దేశంలో పరిస్థితి ఏమిటనేది అందరి ఆలోచన. అయితే కొందరు నిపుణులు మనదేశంలో కరోనాను జయించేందుకు 21 రోజుల లాక్‌డౌన్ సమయం సరిపోదని అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి లాక్‌డౌన్ సమయంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అదుపులోకి రావాలి. కానీ అంచనాలను మించి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజూ పెరుగుతోంది. భారత్‌లో కరోనా కట్టడికి 21 రోజులు సరిపోదని, పూర్తి స్థాయిలో కరోనాను నివారించేందుకు మరికొన్నిరోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిపుణుల అభిప్రాయం. లాక్‌డౌన్ విధించిన లక్ష్యం నెరవేరాలంటే కొంతకాలం పొడిగించాల్సిందేనని లేకుంటే ఆ లక్ష్యం నీరుగారిపోతుందని ఎలాంటి మినహాయింపులు లేకుండా లాక్‌డౌన్ పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయాయి. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ తేలికగా తీసుకోవద్దని అంటున్నారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా సామూహికంగా వ్యాప్తి చెందలేదు. అయినా సామాజిక దూరం పాటించాల్సిందేనంటున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు మరింతగా అందుబాటులోకి రావాలని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu