డ్రగ్స్ ప్రకంపనలు మొత్తం సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. బాలీవుడ్‌తోపాటు కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ మాఫియా ఎవరినీ వదలడం లేదు. ప్రస్తుతం బెంగళూరు డ్రగ్స్ మాఫియా టెలివిజన్ రంగం చుట్టూ తిరుగుతోంది. బాలీవుడ్ తరహాలోనే శాండల్‌వుడ్‌లోనూ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. డ్రగ్స్ కేసులో యాంకర్లకూ నోటీసులు అందుతున్నాయి. ఇప్పటికీ పలువురు అగ్రతారలు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. యాంకర్ అకుల్ బాలాజీ ఇటీవలే బెంగుళూరు పోలీసుల విచారణ ఎదుర్కొన్నాడు. తాజాగా కన్నడ యాంకర్ అనుశ్రీకు సీసీబీ పోలీసులు నోటీసు జారీ చేశారన్న విషయం హల్ చల్ చేస్తోంది. వాట్సాప్ ద్వారా అనుశ్రీ కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అనుశ్రీ మాత్రం తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఈ విషయాన్ని కొట్టి పారేస్తోంది. మంగుళూరు నుంచి నలుగురు అధికారుల బృందం బెంగళూరుకు చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.