HomeTelugu Big Storiesవెల్‌కమ్‌ ట్రంప్‌..

వెల్‌కమ్‌ ట్రంప్‌..

6 23
తొలిసారిగా భారతదేశంలో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఘన స్వాగతం లభించింది. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ట్రంప్‌ దంపతులకు భారత ప్రధాని మోడీ సాదర స్వాగతం పలికారు. ట్రంప్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు మోడీ. ట్రంప్‌ కుమార్తె ఇవాంక, అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌, ఇతర అధికారులతో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, గవర్నర్‌ ఆచార్య దేవ్రత్‌ను అమెరికా అధ్యక్షుడికి మోడికి పరిచయం చేశారు. విమానాశ్రయంలో గుజరాత్‌ కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ట్రంప్‌ను ఆహ్వానించారు. నగరమంతా ఎటు చూసినా మోదీ, ట్రంప్‌ ప్లెక్సీలతో నిండిపోయింది. అమెరికా నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక వాహనంలో కూర్చున్న ట్రంప్‌ .. ప్రజలకు అభివాదం చేశారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

6a 4

విమానాశ్రయం నుంచి సబర్మతీ ఆశ్రమం వరకూ కిలోమీటర్ల మేర దారి పొడవునా ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దారి పొడవునా వివిధ ప్రాంతాల్లో భారతీయ సంప్రదాయ, జానపద నృత్యాలతో కళాకారులు అడుగడునా నీరాజనం పలికారు. ట్రంప్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలతో అహ్మదాబాద్‌ నగరం జనసంద్రంగా మారింది. తొలుత ట్రంప్‌, ప్రధానిమోడీ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రయంలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ట్రంప్ దంపతులు నేలపై కూర్చొని గాంధీ వినియోగించిన చరఖా తిప్పారు. సబర్మతి ఆశ్రమం విశేషాలను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ట్రంప్ దంపతులకు వివరించారు. సబర్మతి ఆశ్రమంలో సందర్శకుల పుస్తకంలో ట్రంప్ దంపతులు సంతకాలు చేశారు. అనంతరం మోతెరా స్టేడియాంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమాన్నికి హాజరు కానున్నారు.

6b 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu