డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ అతిథి పాత్రలో సందడి చేయబోతున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ కోసం అజయ్ ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చారు. మంగళవారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో జక్కన్నతో కలిసి ఆయన తీసుకున్న ఫొటోల్ని చిత్ర బృందం సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ‘ఇవాళ్టి నుంచి అజయ్ జీతో కలిసి షెడ్యూల్ ప్రారంభించడానికి మేమంతా సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నాం. స్వాగతం సర్’ అని ట్వీట్ చేసింది.
ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో బాలీవుడ్ నటి ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్ నటిస్తున్నారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. అయితే ఈ తేదీ మారే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.