టాలీవుడ్‌లో గతయేడాది పలువురు స్టార్ లవ్‌బర్డ్స్ పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో రకుల్- తన ప్రియుడితో, అదితి రావ్ హైదరి- సిద్దార్ధ్‌లు వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈక్రమంలో మరో హీరోయిన్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నట్లు తెలుస్తుంది.
ఆమె ఎవరో కాదు ఫిదా బ్యూటీ సాయిపల్లవి. మలయాళ ‘ప్రేమమ్’ మూవీతో హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత MCA, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం లాంటి సినిమాలతో అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఓవైపు డాక్టర్ కోర్సు పూర్తి చేస్తూనే మరోవైపు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నాగచైతన్యతో ‘తండేల్’ మూవీ చేస్తుంది. సాయిపల్లవి చెల్లి పూజకన్నన్ స్వతహాగా సోషల్ వర్కర్. కాకపోతే తమిళంలో ‘చిత్తరాయి సెవ్వనం’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది.
సోషల్ మీడియాలోనూ సాయి పల్లవి, తన చెల్లి బాగా యాక్టివ్‌గా ఉంటారు. వీరి వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె తన ప్రియుడిని పరిచయం చేసింది. ఇతడి పేరు వినీత్ అని, మొన్నటివరకు తన క్రైమ్ పార్ట్‌నర్, ఇప్పుడు లైఫ్ పార్ట్‌నర్ అని చెప్పుకొచ్చింది.
కానీ అతడి మిగతా డీటైల్స్ లాంటివి ఏం చెప్పలేదు. ఈ క్రమంలోనే తన ఇన్ స్టాలో బాయ్ ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఇది చూసిన అందరూ సాయిపల్లవి చెల్లికి శుభాకాంక్షలు చెబుతున్నారు. బహుశా త్వరలో వీళ్ళ పెళ్లి ఉండొచ్చు అంటున్నారు. అక్క కంటే ముందుగా చెల్లెలే పెళ్లి చేసుకోనుందనమాట.