HomeTelugu Trendingతొమ్మిదేళ్ల మన వివాహబంధం.. ప్రేమ ప్రతిరోజూ పెరుగుతోంది: బన్నీ

తొమ్మిదేళ్ల మన వివాహబంధం.. ప్రేమ ప్రతిరోజూ పెరుగుతోంది: బన్నీ

1 5
టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాలం చాలా వేగంగా పరుగెడుతోందని అంటున్నారు. శుక్రవారం బన్నీ-స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆయన సోషల్‌మీడియా వేదికగా తన భార్య స్నేహారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లినాటి ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన బన్నీ.. ‘తొమ్మిదేళ్ల మన వివాహబంధం. సమయం చాలా వేగంగా పరుగెడుతోంది. కానీ మన మధ్య ఉన్న ప్రేమ మాత్రం ప్రతిరోజూ పెరుగుతోంది.’ అని పేర్కొన్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భార్య పిల్లలతో కేక్‌ కట్‌ చేసిన బన్నీ ఆ ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. ‘వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జీవితంలో ఎంతో విలువైన బహుమతులను(అయాన్‌, అర్హలను ఉద్దేశిస్తూ) నాకందించినందుకు థ్యాంక్యూ క్యూటీ’ అని పేర్కొన్నారు.

కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి పెద్దల అంగీకారంతో 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారికి 2014లో కుమారుడు(అయాన్‌), 2016లో కుమార్తె( అర్హ) జన్మించింది. ఇటీవల ‘అల..వైకుంఠపురములో..’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu