HomeTelugu Trendingప్రభాస్‌ అప్‌డేట్‌ ఇవ్వండి ప్లీజ్‌: ఫ్యాన్స్‌

ప్రభాస్‌ అప్‌డేట్‌ ఇవ్వండి ప్లీజ్‌: ఫ్యాన్స్‌

4 22యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘సాహో’ వంటి భారీ యాక్షన్‌ మూవీ తర్వాత నటిస్తున్న సినిమా ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). 1970 నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడిందని ఇటీవల ప్రచారం జరిగింది. సినిమా కోసం భారీ సెట్‌ ఏర్పాటు చేయాలనుకున్నారని, అది అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో షూటింగ్‌ వాయిదా పడిందని పుకార్లు వచ్చాయి. ఈ విషయంలో ప్రభాస్‌ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

ఇదిలా ఉండగా,తమ హీరో కొత్త సినిమా అప్‌డేట్‌ కావాలని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ట్విటర్‌ వేదికగా కోరుతున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ను ట్యాగ్‌ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #we want prabhas 20 update అనే హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అవుతోంది. ప్లీజ్‌ సర్‌ ప్రభాస్‌ గురించి ఒక్క అప్‌డేట్‌ అయినా ఇవ్వండి సర్‌ అంటూ ఫ్యాన్స్‌ వేడుకుంటున్నారు. మరి ఫ్యాన్స్‌ ఆవేదన చూసైనా దర్శక, నిర్మాతలు స్పందిస్తారేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!