Homeతెలుగు Newsపూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం: కవిత

పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం: కవిత

8 10ఈరోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. ఈ విషయం గురించి టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి మోసానికి పాల్పడలేదని అన్నారు. ‘కాంగ్రెస్‌, ఇతర పార్టీల్లాగా టీఆర్‌ఎస్‌ ఎలాంటి మోసానికి పాల్పడలేదు. గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలన చూసే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మా ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మావైపే ఉంటారన్న నమ్మకం ఉంది. మాకు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ప్రజల కోసం పనిచేశాం. అందుకు బదులుగా ఓటర్లు మమ్మల్ని మరోసారి ఎన్నుకుంటారని ఆశిస్తున్నాం. అది కూడా ఏకగ్రీవంగానే. ఈ విషయంలో మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మాపై, మా పాలనపై ఇతర పార్టీలు ఎలాంటి ఫిర్యాదులూ చేయలేవు’ అని కవిత వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ 82, ప్రజాకూటమి 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu