HomeTelugu Trendingజీ5లో, ఫ్రీగా ఆర్‌ఆర్‌ఆర్‌ చూడొచ్చు!

జీ5లో, ఫ్రీగా ఆర్‌ఆర్‌ఆర్‌ చూడొచ్చు!

image 2 1

జూనియర్ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌గా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డుని సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ థియేటర్లలో విడుదలై 50 రోజులు దాటింది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులకు ప్రత్యేక రోజు!  అయితే రేపు ఓటీటీలో ఈ మూవీ చూసే డిజిటల్‌ ప్రేక్షకులకు తాజాగా జీ5 తీపి కబురు అందించింది. ఈ సినిమాకు ఇప్పుడు ఎలాంటి అదనపు చార్జీలు లేవని, సబ్‌స్క్రైబర్లు ఉచితంగా సినిమా చూడోచ్చంటూ తాజాగా ప్రకటన ఇచ్చింది.దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu