స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తామంటూ.. నందమూరి బాలకృష్ణ చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపింది. ఎప్పుడైతే బాలయ్య ఈ అనౌన్స్మెంట్ చేశారో.. వెంటనే బాలయ్యను హెచ్చరిస్తూ కొందరు ప్రముఖులు మీడియా ముఖంగా కామెంట్ చేస్తున్నారు. ముందుగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి నిజాలను ఏ మాత్రం వక్రీకరించి సినిమా చేసినా.. కోర్టుకు వెళ్తానని చెప్పేసింది. అలానే నాదెండ్ల భాస్కర్ రావు, దగ్గుబాటి వెంకటేశ్వరావు వంటి నాయకులు వాస్తవాలను దాచేసి సినిమా చేస్తే అది ఎన్టీఆర్ జీవిత చరిత్ర అని అనిపించుకోదని అన్నారు.
ఒకవేళ చంద్రబాబు కోణంలో ఎన్టీఆర్ సినిమాను గనుక రూపొందిస్తే పైన ముగ్గురు మెయిన్ విలన్స్ అవుతారు కాబట్టి వాళ్ళు ఈ సినిమా చేయడానికి అంగీకరించే అవకాశాలు లేవు. కాదని బాలయ్య ముందడుగు వేస్తే ఎన్టీఆర్ చరిత్ర పేరుతో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా ఈ ముగ్గురు నుండి సంకేతాలు వెల్లడవుతున్నాయి. మొత్తానికి సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే పెద్ద వివాదాస్పదమవుతుంది. మరి సినిమా మొదలైతే ఇంకెన్ని వివాదాలు జరుగుతాయో.. బాలయ్య ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. చూడాలి!