HomeTelugu Big Storiesసీఎం జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం..!

సీఎం జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం..!

11a
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం వైఎస్ జగన్ వర్సెస్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిగా మారిపోయింది పరిస్థితి… ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడానికి తాము వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.. అయితే మా హయాంలో మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సందర్భంగా ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వ్యతిరేక కథనాలను సభ దృష్టికి తీసుకొచ్చారు చంద్రబాబు.

దీనిపై సీఎం వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని చర్చించడానికి అసెంబ్లీ లేదని.. మీరేం చేశారో, నేనేం చేశానో చర్చిద్దామంటూ అసహనం వ్యక్తం చేశారు జగన్. ఇదే సందర్భంలో ఈ మనిషికి ఏమన్నా బుద్ధి, జ్ఞానం ఉందా అని చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. కళ్లు పెద్దవి చేస్తే భయపడతామా? అంటూ గతంలో చెప్పిన డైలాగ్ కూడా రిపీట్ చేశారు సీఎం జగన్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu