వార్- 2 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది నిర్మాణ సంస్థ.
ఇండిపెండెన్స్ డే కానుకగా 2025 ఆగస్ట్ 14న వార్ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. వార్ 2 మూవీకి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్నాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తోన్న ఆరో సినిమా ఇది.
ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. హృతిక్ రోషన్‌కు ధీటుగా పవర్‌ఫుల్‌గా అతడి క్యారెక్టర్ సాగుతుందని తెలుస్తుంది. 2024 ఫిబ్రవరి నుంచి వార్ 2 సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నట్లు తెలిసింది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తోనే ఎన్టీఆర్ ఈ బాలీవుడ్ మూవీ సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
ఫిబ్రవరిలో ముంబాయిలో ప్రారంభం కానున్న షెడ్యూల్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌నుతెరకెక్కించేందుకు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వార్ 2 సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తుంది.