HomeTelugu Reviews'వాల్తేరు వీరయ్య' మూవీ రివ్యూ

‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ

Waltair veerayya review

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా మాస్ కంటెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో రవితేజ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. నేడు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

‘వాల్తేరు’ ప్రాంతంలోని ‘జాలరిపేట’లో నివసించేవారిలో వీరయ్య (చిరంజీవి) ఒకరు. వీరయ్య తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తండ్రి ( సత్యరాజ్) మరో పెళ్లి చేసుకుంటాడు. ఆ భార్యకి అతని వలన కలిగిన కొడుకే విక్రమ్ (రవితేజ). భార్యభర్తల మధ్య మాటా మాట కారణంగా ఆమె విక్రమ్ ను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది. తండ్రి దగ్గరే ఉంటూ వీరయ్య పెద్దవాడవుతాడు. తండ్రి కూడా చనిపోయిన తరువాత ఆ గూడెం ప్రజలే అతని కుటుంబ సభ్యులు అవుతారు. ఇక తల్లి దగ్గరే పెరిగిన విక్రమ్, పోలీస్ ఆఫీసర్ అవుతాడు.

వీరయ్యకి కండబలం .. గుండెబలం ఎక్కువ. అనుకున్నది సాధించడానికి ఆయన వెనుకాడడు. కోస్ట్ గార్డులు సైతం ఒక్కోసారి ఆయన సాయాన్ని తీసుకుంటూ ఉంటారు. అలాంటి వీరయ్య .. కోర్టులో ఒక కేసు గెలవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ కేసు గెలవడానికి ఆయనకి పాతిక లక్షలు అవసరమవుతాయి. ఆ డబ్బు ఎలా సమకూర్చాలా అని ఆయన ఆలోచన చేస్తుండగా, సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) అనే ఒక కానిస్టేబుల్, తన బావమరిది బాలరాజు ( వెన్నెల కిశోర్)ను వెంటబెట్టుకుని ఆయన దగ్గరికి వస్తాడు.

Waltair veerayya 2

సాల్మన్ సీజర్ (బాబీ) అనే ఒక అంతర్జాతీయ నేరస్థుడిని అనుకోని కారణాల వలన ఒక రాత్రి తమ పోలీస్ స్టేషన్లో ఉంచవలసి వచ్చిందనీ, అయితే అతను స్టేషన్లోని పోలీసులందరినీ చంపేసి తప్పించుకున్నాడని వీరయ్యతో చెబుతాడు. సాల్మన్ మలేసియాలో ఉంటూ డ్రగ్స్ దందా నడుపుతూ ఉంటాడనీ, అతణ్ణి ఎలాగైనా ఇండియాకి తీసుకుని వచ్చి తమకి అప్పగించమని కోరతాడు. ఆ పని చేసిపెడితే అందుకు 25 లక్షలు ఇస్తానని అంటాడు.

కోర్టు కేసు గెలవాలంటే తనకి డబ్బు అవసరం ఉన్నందు వలన ఆ పని చేసిపెట్టడానికి వీరయ్య ఒప్పుకుంటాడు. తన బృందాన్ని వెంటబెట్టుకుని మలేసియా వెళతాడు. అక్కడే అతనికి అతిథి (శృతి హాసన్) పరిచయమవుతుంది. సాల్మన్ సీజర్ ను పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదనీ, అతని వెనుక అతని అన్నయ్య మైఖేల్ సీజర్ (ప్రకాశ్ రాజ్) ఉన్నాడని తెలుసుకుంటాడు. అయినా వచ్చిన పని పూర్తి చేసే వెళతానంటూ వీరయ్య రంగంలోకి దిగుతాడు. అయితే అతను కేవలం తమ పనిమీదనే అక్కడికి రాలేదనే విషయం సీతాపతికి అర్థమవుతుంది. మలేసియాలో వీరయ్యకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడతను ఏం చేస్తాడు? అక్కడ అతనికున్న సొంత పనేంటి? అనేదే కథ.

విశ్లేషణ: ఈ కథ మారేడుమిల్లి ఫారెస్టు ఏరియాలో ఒక ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ కావడంతో ప్రారంభం అవుతుంది. ఆ ఫ్లైట్ లో తరలిస్తున్న క్రిమినల్ సాల్మన్ ను దగ్గరలోని జైలులో ఒక నైట్ ఉంచుతారు. అతను అక్కడి నుంచి తన మనుషులతో తప్పించుకుంటాడు. ఆ తరువాత స్మగ్లర్ ల చేతిలో బందీలుగా ఉన్న కోస్టు గార్డులను కాపాడే క్రమంలో వీరయ్య గా చిరంజీవి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంతవరకూ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ వెంటనే వచ్చే ‘ బాస్ పార్టీ’ పాట కూడా మంచి సందడి చేస్తుంది.

ఎప్పుడైతే వీరయ్య మలేసియా బయల్దేరతాడో అక్కడి నుంచి కథ ఆకట్టుకోదు. మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న మైఖేల్ తమ్ముడు సాల్మన్ ను ఆకతాయిగా కలుసుకోవడం .. ఆయనను మాయచేసి కిడ్నాప్ చేయాలనుకోవడం .. అదీ కుదరకపోతే మభ్యపెట్టి ఇండియాకి తీసుకెళ్లాలనుకోవడం వంటి సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. ఇంకా శృతి హాసన్-చిరంజీవి కాంబినేషన్ లోని సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు.

Waltair veerayya 1

ఇంటర్వెల్ బ్యాంగ్ సమయానికి ”మీ కథలోకి నేను రాలేదు .. నా కథలోకి మీరొచ్చారు .. అసలు కథ ఇప్పటి నుంచే మొదలవుతుంది” అని వీరయ్య అంటాడు. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవుతుంది. ఇంటర్వెల్ తరువాత పోలీస్ ఆఫీసర్ గా రవితేజ ఎంటరవుతాడు. ఫ్లాష్ బ్యాకులో చిరంజీవిని కలుపుకుంటూ రవితేజ వైపు నుంచి కథ నడుస్తూ ఉంటుంది.
నటీనటులు: దర్శకుడు బాబీ చిరంజీవి పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేదు. కథనంతో పాటు చిరంజీవికి రాసుకున్న డైలాగ్స్ కూడా బలహీనంగానే ఉన్నాయి. చిరంజీవి పాత్రకి కామెడీ టచ్ ఎక్కువగా ఇవ్వడమే మైనస్ గా అనిపిస్తుంది. ఇక రవితేజకి ఒక పవర్ఫుల్ పాత్రను ఇచ్చి, ఆయన ఎనర్జీకి తగినట్టుగా ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది. విలన్స్ గా అటు ప్రకాశ్ రాజ్ .. బాబీ అన్నదమ్ములు, హీరోల వైపు నుంచి చిరంజీవి – రవితేజ అన్నదమ్ములు. ఈ నాలుగు పాత్రల చుట్టూనే ప్రధానమైన కథ తిరుగుతుంది. ఇక చిరంజీవి సరసన శ్రుతి .. రవితేజ జోడీగా కేథరిన్ పాత్రలు నామమాత్రం. ఈ రెండు పాత్రలు ప్రేక్షకులకు రెగ్యులర్ గా టచ్ లో కూడా ఉండవు. దేవిశ్రీ బాణీలు బాగున్నాయి. చిరంజీవి ఇచ్చిన ఛాన్స్ ను దర్శకుడు సరిగ్గాఉపయోగించుకోలేకపోయాడనే అనాలి.

టైటిల్‌ :వాల్తేరు వీరయ్య
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా, కేథరిన్ థ్రెసా తదితరులు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని-రవిశంకర్
దర్శకత్వం: బాబీ కొల్లి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

హైలైట్స్‌‌: చిరంజీవి నటన
డ్రాబ్యాక్స్‌: రొటీన్‌ కథ

చివరిగా: రొటీన్‌ మాస్‌ ఎంటర్‌
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu