టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ సంస్థ వైజయంతీ మూవీస్ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా.. తమ బ్యానర్‌లో నటించిన హీరోయిన్‌లను ఒకొక్కరిగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లో శ్రీదేవి చేసిన ఇంద్రజ పాత్ర పోస్టర్ ని పోస్ట్ చేసి ‘మా ఇంద్రజ’ అని క్యాప్షన్ పెట్టింది. ఆ తర్వాత ‘మా సీత’ అంటూ సీతారామంలో మృణాల్ ఠాకూర్ పోస్టర్‌ని పోస్ట్ చేశారు.
మూడో రోజు ఆజాద్ సినిమాలో అంజలిగా సౌందర్య పోస్టర్‌ని షేర్ చేశారు. నాలుగో రోజు అమ్మ రాజీనామా సినిమాలో భారతిగా శారద పోస్టర్‌ని షేర్ చేశారు. అయిదో రోజు ఎవడే సుబ్రమణ్యంలో ఆనందిగా మాళవిక నాయర్‌ని, ఆరో రోజు కుమారి శ్రీమతిలో శ్రీమతిగా నిత్యా మీనన్ పోస్టర్‌ని షేర్ చేశారు. ఇక తాజాగా ఏడో రోజు జాతి రత్నాలు సినిమాలో మా చిట్టి అంటూ.. ఫరియా అబ్దుల్లా పోస్టర్‌ని వైజయంతీ మూవీస్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
కాగా వైజయంతి మూవీస్ శరన్నవరాత్రులు కాన్సప్ట్‌కి నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. ప్రభాస్ కల్కి 2898 AD నుంచి దీపికా పదుకొనే పోస్టర్ విడుదల చేయమని కోరుతున్నారు ఫ్యాన్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ గ్లోబల్ సినిమాగా కల్కి రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. శరన్నవరాత్రులలో ఎదో ఒక రోజు దీపికా కొత్త లుక్‌ని విడుదల చేయాలని ఫ్యాన్స్ డిమెండ్ చేస్తున్నారు.