ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి బరిలో జనవరి 11 వ తేదీన రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ భారీ ఎత్తున విడుదలైంది. మొదటి నుంచి సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయినప్పటికీ రిలీజ్ తరువాత ఒక్కసారిగా మారిపోయింది. ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ వచ్చింది. మొత్తంగా చూసుకుంటే సినిమా ప్లాప్ అనే చెప్పాలి.
సినిమా ప్లాప్ అంటే సహజంగా కలెక్షన్లు దారుణంగా ఉంటాయి. కాని ‘వినయ విధేయ రామ’ విషయంలో అది రివర్స్ గా మారింది. సినిమా ప్లాప్ టాక్ ను సొంతం చేసుకున్న కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోయింది. 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 59 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది అంటే చరణ్ స్టామినా ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 8 రోజుల కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం : రూ.12.14 కోట్లు, సీడెడ్ : రూ.11. 29 కోట్లు, నెల్లూరు : రూ.2.76 కోట్లు, గుంటూరు: రూ.6.11 కోట్లు, కృష్ణ: రూ.3.48 కోట్లు, పశ్చిమ గోదావరి: రూ.4.01కోట్లు, తూర్పు గోదావరి: రూ.4.92 కోట్లు, ఉత్తరాంధ్ర : రూ.7.23 కోట్లు, టోటల్ షేర్: రూ.51.85 కోట్లు