HomeTelugu Trendingహీరోగా మారనున్న వీవీ వినాయక్‌

హీరోగా మారనున్న వీవీ వినాయక్‌

1 13డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన వినాయక్‌ హీరోగా ఓ చిత్రంలో నటిస్తుండడంతో అభిమానులు సర్‌ప్రైజ్‌కు గురయ్యారు. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌. నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఈయన ‘శరభ’ అనే సినిమాను తెరకెక్కించారు. మరో రెండు నెలల్లో చిత్రీకరణ ప్రారంభం అవుతుందని చిత్రవర్గాలు వెల్లడించాయి. 2018లో వచ్చిన ‘ఇంటెలిజెంట్‌’ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు. సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu