Bigg Boss 8 Telugu Double Elimination:
Bigg Boss 8 Telugu ఫినాలే కి దగ్గర పడుతున్న క్రమంలో కేవలం ఏడుగురు సెలబ్రిటీలే ఇంట్లో మిగిలి ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువమంది డేంజర్ జోన్‌లో ఉన్నారు. అవినాష్ మినహా ఇంట్లో ఉన్న అందరికీ ఎలిమినేషన్ భయం తారాస్థాయికి చేరుకుంది.
తాజా సమాచారం ప్రకారం, మొదట సేఫ్ జోన్‌లో ఉన్న నబీల్ కూడా ఇప్పుడు డేంజర్ జోన్‌లోకి జారిపోయాడు. అతని ఓటింగ్ గణనీయంగా తగ్గడం వల్ల ఇది జరిగింది. ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్న వారిలో ప్రేరణ, నబీల్, రోహిణి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
View this post on Instagram
ఆఖరి వారంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, మేకర్స్ కూడా సెలబ్రిటీలకు మరింత కఠినమైన ఛాలెంజ్‌లను విసురుతున్నారు. ప్రేక్షకులను కూడా ఉత్కంఠలో ఉంచే విధంగా కొత్త ట్విస్టులను ప్లాన్ చేస్తున్నారు. ప్రతి కంటెస్టెంట్లు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు.
అయితే, వీరిలో ఎవరు ఫినాలే వారంలోకి ప్రవేశిస్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఆసక్తి పెరుగుతోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం మిగిలి ఉన్న సభ్యుల మధ్య చర్చలు, గొడవలు మరింత తీవ్రంగా మారాయి.
ఓటింగ్ తగ్గుదల కారణంగా నబీల్ డేంజర్ జోన్‌లో చేరాడు. ప్రేరణ, రోహిణి కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వకుండా ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఇంటి నుండి బయటకు వస్తారో వేచి చూడాలి.
ALSO READ: Pushpa 2 బృందం మీద కోపంగా ఉన్న మలయాళం స్టార్.. ఎందుకంటే!