టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ‘భీష్మ’ మూవీ ఇచ్చిన హిట్‌తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ హిట్‌ని మాత్రం సొంతం చేసుకోవట్లేదు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్‌కొట్టాలని నితిన్ ఫిక్స్ అయ్యాడు. గతంలో ‘భీష్మ’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను అందించిన డైరెక్టర్ వెంకీ కుడుములతో హీరో నితిన్ మరో సినిమాను చేస్తున్నాడు. ఈ హిట్ కాంబోలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చినా షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.
వెంకీ కుడుముల నితిన్ రష్మిక మందన్నా కాంబినేషన్లో (#VNRTrio) రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ తాజాగా ప్రారంభం అయ్యాయి. దీనికి నేషనల్ అవార్డు విన్నర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీంతో చిత్ర యూనిట్ చెన్నైలోని అతడి స్టూడియోలో నితిన్ సినిమాకు సంబంధించిన ఆల్బమ్పై వర్క్ మొదలు పెట్టింది.
తాజాగా మొదలైన మ్యూజిక్ సిట్టింగ్స్లో జీవీ ప్రకాశ్ కుమార్తో పాటు దర్శకుడు వెంకీ కుడుముల లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేస్తూ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక ఈ మూవీలో మ్యూజిక్ హైలైట్గా ఉండబోతుందట. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంతో స్టైలిష్ మోడ్తో డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అప్పుడే దీనిపై హైప్ క్రియేట్ అవుతోంది.
ఈ సినిమాలో నితిన్ గతంలో చూడని విధంగా స్టైలిష్ గెటప్తో కనిపిస్తాడని తెలిసింది. అలాగే రష్మిక క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందట. ఇక హిట్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై యలమంచిలి రవి నవీన్ యెర్నీని నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు