HomeTelugu Newsతెలుగు నటుడు వైజాగ్‌ ప్రసాద్ కన్నుమూత

తెలుగు నటుడు వైజాగ్‌ ప్రసాద్ కన్నుమూత

రంగస్థల, వెండితెర సీనియర్‌ నటుడు వైజాగ్‌ ప్రసాద్‌(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కళా రంగంలో వైజాగ్‌ ప్రసాద్‌గా స్థిరపడిన ఆయన స్వస్థలం విశాఖపట్నంలోని గోపాలపురం. అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. ఆయనకు కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్‌ ఉన్నారు.

2 18

1963లో నాటక రంగంలోకి ప్రవేశించిన వైజాగ్‌ ప్రసాద్.. అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాలధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక, వేట కుక్కలు, కాలకూటం, ఋత్విక్‌, గరీబీ హఠావో లాంటి నాటికలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. సుమారు 700 నాటికల్లో నటించిన ఆయన 1983లో బాబాయ్‌ అబ్బాయ్‌ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. నువ్వు నేను, భద్ర, జై చిరంజీవ, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లా తదితర చిత్రాల్లో నటించారు. వైజాగ్‌ ప్రసాద్‌ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu